రోడ్డుపైనే కళాశాల బస్సులు నిలపడంతో ట్రాఫిక్‌కు అంతరాయం
సంగారెడ్డి పట్టణంలోని జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ఉన్న మురళీకృష్ణ దేవాలయం సమీపంలో గురువారం సాయంత్రం వేళ కళాశాల బస్సులను రోడ్డుపైనే నిలిపి విద్యార్థులను ఎక్కించడం వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 23 (రథసారథి న్యూస్): సంగారెడ్డి పట్టణంలోని జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ఉన్న మురళీకృష్ణ దేవాలయం సమీపంలో గురువారం సాయంత్రం వేళ కళాశాల బస్సులను రోడ్డుపైనే నిలిపి విద్యార్థులను ఎక్కించడం వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
కార్యాలయాలు ముగిసే సమయం కావడంతో ఈ మార్గంలో వాహనాల రద్దీ అధికంగా ఉండగా, రోడ్డుపై బస్సులు నిలపడంతో కొంతసేపు ట్రాఫిక్ స్తంభించింది. దీంతో ద్విచక్ర వాహనదారులు, ఉద్యోగులు, ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధాన రహదారులపై బస్సులను నిలపకుండా ప్రత్యేక బస్‌బేలు లేదా సురక్షిత ప్రదేశాల్లో విద్యార్థులను ఎక్కించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ట్రాఫిక్ పోలీసులు, సంబంధిత అధికారులు, కళాశాల యాజమాన్యాలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.



