Sangareddy

తెలంగాణ రక్షణ సేనలో పలువురు నాయకుల చేరిక

తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) పార్టీ బలోపేతంలో భాగంగా సంగారెడ్డి, రాజంపేట ప్రాంతాలకు చెందిన పలువురు నాయకులు గురువారం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 30 (రథసారథి న్యూస్): తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) పార్టీ బలోపేతంలో భాగంగా సంగారెడ్డి, రాజంపేట ప్రాంతాలకు చెందిన పలువురు నాయకులు గురువారం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సంగారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జి కలబ్‌గూర్ దయాకర్ రెడ్డి సమక్షంలో సంగారెడ్డిలోని పార్టీ కార్యాలయంలో వారికి పార్టీ కండువాలు కప్పి ఘనంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎం. హరికృష్ణ, అంజనేయులు, శివకృష్ణ, నరేష్, రమేష్, ప్రసాద్, యాదగిరి, సురేష్, అశోక్, శేఖర్, శ్రీరామ్, రవి తదితరులు తెలంగాణ రక్షణ సేనలో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గోపాల్ రెడ్డి, నర్సింహా రెడ్డి, రాహుల్ యాదవ్, ఆసిఫ్, అనూప్ తదితరులు పాల్గొని నూతనంగా పార్టీలో చేరిన నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలబ్‌గూర్ దయాకర్ రెడ్డి మాట్లాడుతూ, కవితక్క పిలుపు మేరకు తెలంగాణ రక్షణ సేన సిద్ధాంతాలను, పార్టీ ప్రకటించిన పంచజన్యం అజెండాను గ్రామ గ్రామానికీ, ప్రతి వాడకూ తీసుకెళ్లి పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.

తెలంగాణ సమగ్ర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే పార్టీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ లక్ష్య సాధనలో ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు చురుకుగా పాల్గొని పార్టీ విస్తరణకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button