సంగారెడ్డిలో మాదిగ బోనాల కరపత్రం విడుదల చేసిన కంది సర్పంచ్ చిన్న సాయి శ్రీ రామ్
ఆషాడ మాసం సందర్బంగా ఆగష్టు 8న సంగారెడ్డి మాదిగ బోనాలు జయప్రదం చేయాలనీ కంది గ్రామ సర్పంచ్ చిన్న సాయి శ్రీరామ్ అన్నారు

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 1 (రథసారథి న్యూస్):
ఆషాడ మాసం సందర్బంగా ఆగష్టు 8న సంగారెడ్డి మాదిగ బోనాలు జయప్రదం చేయాలనీ కంది గ్రామ సర్పంచ్ చిన్న సాయి శ్రీరామ్ అన్నారు.. శనివారం సంగారెడ్డి ఐబీ లో మాదిగ బోనాల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కరపత్రం విడుదల చేశారు..
ఈ సందర్బంగా మాదిగ బోనాల ఉత్సవ కమిటీ సభ్యులు బంగారు కృష్ణ, కసిని శ్రీకాంత్ గౌతమ్ మాట్లాడుతూ ఆషాడ మాసం సందర్బంగా మాదిగ సమాజం అందరు కలిసి అమ్మ వారికీ పెద్ద సంఖ్యలో బోనాలు సమర్పించాలని సంగారెడ్డి మాదిగ బోనాల ఉత్సవ కమిటీ నిర్ణయించింది అన్నారు ..బోనాల కార్యక్రమం సంగారెడ్డి పట్టణంలోని ఐ.బి. నుండి అస్తబల్ తోటలో ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లీ మరియు నల్ల పోచమ్మ తల్లీ ఆలయం వరకు నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో మహిళల బోనాలు, డప్పు కళాకారులూ,డీ.జే, జోగినిలు,పోతురాజుల అట, పాటలతో పెద్ద ఎత్తున్న నిర్వహిస్తున్నాము అన్నారు. ఆగష్టు 8 న జరిగే బోనాల పండుగ కార్యక్రమంలో మాదిగ ప్రజాప్రతినిధులు, నాయకులు, డాక్టర్స్, అడ్వకేట్స్, అధికారులు, ఉద్యోగులు, జర్నలిస్ట్ లు, మహిళాలు, యువకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలనీ మాదిగ బోనాల ఉత్సవ కమిటీ నాయకులు అన్నారు ఈ కార్యక్రమంలో గంగేరి శ్రీనివాస్, పోలీస్ రాంచందర్, దామగాళ్ల మురహరి, దిలీప్, మల్లేపల్లి శ్రీకాంత్,గంగేరి అనిల్, డప్పు సాయి రామ్, కొత్తపల్లి బాబులు, సాయి రామ్, విజయ్, నర్సింహా రాజ్, ఉదయ్, కొత్తపల్లి అనిల్, సాయి కిరణ్, ఎల్. వేణు గోపాల్, పోతారాజ్ నవీన్, పవన్ తదితరులు పాల్గొన్నారు

