Sangareddy
జాతీయ రహదారిపై అదుపుతప్పిన కంటైనర్ లారీ.. భారీ ట్రాఫిక్ జామ్
-పోలీసుల చొరవతో ట్రాఫిక్ పునరుద్ధరణ

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 5 (రథసారథి న్యూస్): సంగారెడ్డి జిల్లా పెద్దాపూర్ సమీపంలోని జాతీయ రహదారి–65పై తుంగమడుగు వద్ద సంయుక్త స్కూల్ సమీపంలో బుధవారం కంటైనర్ లారీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో రహదారికి అడ్డంగా నిలిచిపోయింది.
జహీరాబాద్ నుంచి సంగారెడ్డి వైపు వస్తున్న ఈ కంటైనర్ లారీ ప్రమాదానికి గురికావడంతో జాతీయ రహదారిపై కొంతసేపు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తూ లారీని తొలగించే చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం గానీ, గాయాలు గానీ సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.



