Sangareddy
బోనాల ఉత్సవ పోస్టర్ను ఆవిష్కరించిన జగ్గారెడ్డి

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 6 (రథసారథి న్యూస్): సంగారెడ్డి పట్టణంలో తొలిసారిగా మాదిగ బోనాల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించనున్న బోనాల ఉత్సవాల పోస్టర్ను టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, బోనాల ఉత్సవాలకు శ్రీ అంబాత్రయ క్షేత్ర పీఠాధిపతి శ్రీ ఆదిత్య పరా శ్రీ స్వామీజీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తెలిపారు.
శనివారం ఐబీ కార్యాలయం నుంచి ప్రారంభమయ్యే బోనాల ఊరేగింపు హస్తబల్ ఎల్లమ్మ ఆలయం వరకు కొనసాగుతుందని వెల్లడించారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన న్యాయవాదులు, పోలీసులు, జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు కుటుంబ సమేతంగా పెద్ద సంఖ్యలో ఉత్సవాల్లో పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు



