Sangareddy

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్‌కు ఘన నివాళి

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 6 (రథసారథి న్యూస్): తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో గురువారం ఘనంగా నివాళులర్పించారు. ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తనయుడు చింత సాయినాథ్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన త్యాగాలు, ఉద్యమ స్ఫూర్తి చిరస్మరణీయమని కొనియాడారు.

ఆయన ఆశయాలు, సిద్ధాంతాలను భావితరాలకు చేరవేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జైపాల్ రెడ్డి, కౌన్సిలర్లు, కొత్తపల్లి శ్రీకాంత్, దశరథ్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు చక్రపాణి, నాయకులు విఠల్, రామగౌడ్, అజీమ్, వాజిద్, రవి, లతీఫ్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button